
వారణాసి (యు.పి), 19 అక్టోబర్ (హి.స.) యూపీలోని వారణాసి జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలోని మిర్జామురాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్-వారణాసి జాతీయ రహదారి (NH-19)పై సోమవారం రూపాపూర్ వద్ద ఫ్లైఓవర్‌పై నిలిపివున్న స్కార్పియో కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు స్కార్పియో వాహనం వెనుక భాగం నుజ్జు నుజ్జవడమే కాకుండా, కారు వెలుపల నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు వంతెన పైనుంచి సుమారు 30 అడుగుల కిందకు పడిపోయారు. బాధితులంతా వింధ్యాచల్ ధామ్ అమ్మవారిని దర్శించుకుని కాశీకి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. మిర్జామురాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పరారైన లారీ డ్రైవర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..