
ముంబై, 19 అక్టోబర్ (హి.స.)
స్టాక్ మార్కెట్ లో నేడు బ్యాంకింగ్ స్టాక్ లో భారీ పతనం కనిపిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపాయి.
దాంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్ ర్యాలీ పెట్టుబడిదారుల కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.
నేటి ట్రేడింగ్లో మధ్యాహ్నం సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 295 పాయింట్లు క్షీణించింది. ఈ రెండు ప్రధాన సూచీల్లో తమ గత రెండు సెషన్ల లాభాల పరంపరకు బ్రేక్ పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు