
అమరావతి, 02 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో వైద్యులపై కూటమి సర్కార్ మరో సారి కొరడా ఝుళిపించింది. సుదీర్ఘకాలం పాటు అనధికారంగా విధులకు గైర్హాజరీ అయిన వైద్యులకు ప్రభుత్వం ఉద్వాసన తెలిపింది.
70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించింది. ఇదే రీతిగా వ్యవహరిస్తున్న 193 మందిపై చర్యలు తీసుకోనుందని.. అందుకు సంబంధించిన చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఆ జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు డీఎస్హెచ్, డీఎంఈ అధికారులు అందజేశారు.
ఈ నేపథ్యంలో 70 మంది వైద్యులను తొలగిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించ వద్దని ఈ సందర్భంగా అధికారులను మంత్రి సత్య కుమార్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ