ఏపీ వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30,436 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నేడు కీలక గణాంకాలు వెలువడ్డాయి.
AP Govt


అమరావతి , 02 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నేడు కీలక గణాంకాలు వెలువడ్డాయి. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రూ.30,435.98 కోట్ల ఆదాయాన్ని సమీకరించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది సుమారు 18 శాతం పెరుగుదలగా నమోదైంది.

సెప్టెంబర్ నెలలోనే వాణిజ్య పన్నుల ద్వారా రూ.4,986.18 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన రూ.4,334.84 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.651.34 కోట్ల మేర అదనపు ఆదాయం నమోదైంది. శాతం పరంగా చూస్తే సెప్టెంబర్ వసూళ్లలో 15.03 శాతం వృద్ధి కనిపించింది.

నికర GST వసూళ్లు కూడా రాష్ట్ర పన్ను ఆదాయంలో ప్రధాన భాగంగా ఉన్నాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో నికర GST వసూళ్లు రూ.19,635 కోట్లకు పైగా నమోదయ్యాయి. పన్ను చెల్లింపుల్లో అనుసరణ పెరగడం, పన్ను ఎగవేత నిరోధక చర్యలు, డిజిటల్ పర్యవేక్షణ, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ వంటి అంశాలు ఆదాయ వృద్ధికి దోహదపడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande