ప్రభుత్వ ఆస్పత్రిలో సామాన్యుడిలా వైద్యం చేయించుకున్న కలెక్టర్
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మార్నింగ్ రన్నింగ్ చేస్తుండగా స్వల్పంగా కాలికి ఫ్రాక్చర్ కావడంతో ఆయన ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా జయశంకర్ భూపాలపల
Collector


భూపాలపల్లి, 02 అక్టోబర్ (హి.స.)

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

మార్నింగ్ రన్నింగ్ చేస్తుండగా స్వల్పంగా కాలికి ఫ్రాక్చర్ కావడంతో ఆయన ఎలాంటి హంగూ ఆర్భాటాలకు వెళ్లకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనరల్ ఆస్పత్రిలో సామాన్య పౌరుడిలా వైద్య సేవలు పొందారు.

కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ను వైద్యులు పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం ద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం కలిగించే సందేశాన్ని ఆయన ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande