బిహార్లో విషాదం.. చెరువులో మునిగి నలుగురు బాలికలు మృతి
బిహార్లో విషాదం.. చెరువులో మునిగి నలుగురు బాలికలు మృతి
Bihar


బీహార్, 02 అక్టోబర్ (హి.స.) చెరువులో మునిగిన నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన బీహార్ ల చోటుచేసుకుంది. బిహార్, ఈస్ట్ చంపారన్ జిల్లా, ఇనర్వభార్ పంచాయత్ పరిధిలోని బంకాట్ గ్రామంలో శుక్రవారం ఘటన జరిగింది.. శుక్రవారం ఉదయం, బంకాట్ గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు స్థానిక చెరువుకు ఉదయం 9.30 గంటల సమయంలో స్నానం చేసేందుకు వెళ్లారు. అందులో నలుగురు నీటిలోకి వెళ్లగా.. ఒక బాలిక ఒడ్డునే ఉండిపోయింది. లోపలికి వెళ్లిన బాలికలు లోతును అంచనా వేయలేక నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. కళ్లముందే నలుగురు మునిగిపోవడంతో అక్కడే ఉన్న బాలిక పక్కనే ఉన్న కొందరికి వెంటనే విషయం చెప్పింది. వెంటనే సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో గల్లంతైన నలుగురు బాలికల మృతదేహాల్ని వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెలు కూడా ఉన్నారు. మృతులంతా 13 ఏళ్లలోపు బాలికలే ఉన్నట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande