నేడు మదనపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
నేడు సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు.
AP CM


అమరావతి, 02 అక్టోబర్ (హి.స.)

నేడు సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు పంట ఉత్పత్తుల ఎగుమతి వరకు రైతులకు పూర్తి అండగా నిలవనుంది ప్రభుత్వం.

10 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో సమగ్ర అభివృద్ధి పనులను చేపట్టనుంది. మూడు దశల్లో లక్ష కోట్ల భారీ వ్యయంతో ఈ హబ్ ఆవిష్కృతం కానుంది. ఇందులో ప్రభుత్వం 40వేల 352 కోట్లు సమకూరుస్తోంది. ప్రైవేట్ రంగం ద్వారా మరో 60వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande