
ముంబై, 02 అక్టోబర్ (హి.స.) భారత్లో బంగారం ధరలు రోజుకో రీతిలో మారుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు, వంటివి పసిడికి డిమాండ్ పెరిగేలా చేస్తుంటే డాలర్ బలపడటం, బాండ్స్పై రాబడులు పెరగడం వంటివి ధరలను కిందకు లాగుతున్నాయి.
ఫలితంగా ఓ రోజు ధరలు ఊహకందని రీతిలో ఎగబాకితే ఆ మరుసటి రోజే పడిపోతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 2) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,230గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,400, 22 క్యారెట్ల ధర రూ.1,36,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV