పొన్నూరు మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటన
పొన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు(శుక్రవారం) మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
పొన్నూరు మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటన

పొన్నూరు, 02 అక్టోబర్ (హి.స.)

పొన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు(శుక్రవారం) మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పొన్నూరులో గాంధీజీ విగ్రహానికి మంత్రి, ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మొక్కలు నాటారు. పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32.10 కోట్లు విలువైన పనులకు నారాయణ శంకుస్థాపన చేశారు.

రూ.22.10 కోట్ల విలువైన నీటి సరఫరా పనులకు, నాగుల చెరువు పునరుద్ధరణ పనులకు నారాయణ శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 కోట్ల విలువైన సీసీ రోడ్లు, గ్రీనరీ పనులకు శంకుస్థాపన జరిగింది. పొన్నూరు మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం రూ.126.28 కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande