ఆక్వా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను, ఆక్వా యూనిట్ల నిర్వాహకులను ఆదేశించారు.
Pavan kalyan


అమరావతి , 02 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను, ఆక్వా యూనిట్ల నిర్వాహకులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్ల కార్యకలాపాలను సమీక్షించి కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమలవుతున్నాయా లేదా పరిశీలించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు, చేపల సాగు, ప్రాసెసింగ్, ఎగుమతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా రంగం రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా, కోల్డ్ చైన్, ఎగుమతులు వంటి అనేక రంగాలకు ఉపాధి కల్పిస్తోంది.

అయితే ఆక్వా పరిశ్రమ విస్తరణతో పాటు నీటి కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాలపై ప్రభావం, సముద్ర పర్యావరణానికి సంబంధించిన అంశాలు కూడా ప్రాధాన్యం పొందుతున్నాయి. అందువల్ల పరిశ్రమ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande