
అమరావతి, 02 అక్టోబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాతున్నాయి. ఇటీవల వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఉక్కపోతతోపాటు.. పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అలాగే.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు
కొనసాతున్నాయి. ఇటీవల వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఉక్కపోతతోపాటు.. పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అలాగే.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో వాతావరణం..
తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం వేళ కొంత ఎండ తీవ్రత కనిపించినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడే అవకాశముంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల వరకు.. 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు, రైతులకు అధికారుల హెచ్చరికలు
తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచించారు. కోత దశకు వచ్చిన పంటలను రైతులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV