
అమరావతి, 02 అక్టోబర్ (హి.స.)భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన మహాత్ముడి సేవలను, త్యాగాలను ప్రత్యేకంగా స్మరించుకున్నారు.
మన దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి బాపూజీ చూపిన శాంతి, సహన, సత్య మార్గంలో పయనిద్దాం. గాంధీజీ కలలుగన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత సాధించి, ఆ మహాత్ముని ఆశయాల సాకారానికి కృషి చేద్దామని’ ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV