ఉద్యాన రంగంలో సరికొత్త అధ్యాయం.. రాయలసీమ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన
మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు  శంకుస్థాపన


మదనపల్లె, 02 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉద్యానరంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం రాయసీమ రైజింగ్ ప్రాజెక్టును తీసుకురాగా రాయలసీమ హార్టికల్చర్ హబ్కు లాంఛనంగా ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టు కింద రూ. లక్ష కోట్లతో అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించారు. ప్రాజెక్టులో పూర్వోదయ పథకం కింద ప్రభుత్వ వాటాగా రూ.40,352 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రైవేట్ రంగం నుండి మరో రూ.60వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని నిర్ణయించారు.026 నుండి 2029 మధ్య మూడు దశల్లో 10 జిల్లా్ల్లోని 201 కస్టర్లలో అమలు చేయనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ గా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఆరు లక్షల హెక్టార్లుగా ఉండగా 2029 నాటికి దీనిని 14.41 లక్షల హెక్టార్లకు పెంచనున్నారు. ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు సైతం కల్పించనున్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.4,562 కోట్లతో 5,721 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, రూ.20,884 కోట్లతో నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీనివల్ల 9 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు, 4.3 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగానే రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు కూడా శంకుస్థాపన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande