
హైదరాబాద్, 02 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో గురువారం అర్ధరాత్రి తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన ఘటన జరిగింది.
గురువారం అర్ధరాత్రి దాటిన తరవాత శంషాబాద్ నుండి కడప వెళ్తున్న విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఓ ప్రయాణికుడు డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుడిని పట్టుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ప్రయాణికుడు కావాలనే ఇలా చేశాడా? లేదంటే ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఫ్లై ముంబాయి విమానంలో పైలట్ పై దాడి జరిగిన తరవాత రెండు రోజులకే శంషాబాద్ నుండి వెళుతున్న విమానంలో ప్రయాణికుడి ప్రవర్తన ఆందోళనకరంగా మారింది.
అతడు మద్యం మత్తులో ఉన్నాడా, మానసిక సమస్యలతో ఇలా చేశాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV