స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాల కోసం వైఎస్సార్సీపీ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది.
Court


అమరావతి , 20 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న నేపథ్యంలో, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర బలగాలను నియమించాలని ఆ పార్టీ కోరింది.

ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బలగాలను మోహరించడానికి కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలను మాత్రమే ఆధారంగా తీసుకోలేమన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. అయితే ఆ అప్పీల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande