
ఇచ్చాపురం, 21 అక్టోబర్ (హి.స.)
: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం దాసన్నపేటలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఫాన్సీ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న సామగ్రి కాలి బూదిదయ్యింది. సమాచారం అందుకున్న ఇచ్చాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ