టైగర్ ష్రాఫ్ కాల్పుల ఘటనలో మరో నలుగురు అరెస్ట్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
Fire


ఢిల్లీ , 21 అక్టోబర్ (హి.స.)బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నలుగురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని హరియాణాలోని సోనిపత్ కు చెందిన కునాల్ (21), సుమిత్ (19), ఉత్తర్ ప్రదేశ్కు చెందిన రాధ (23), బబిత (23)గా గుర్తించారు. అక్టోబర్ 20న వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాధ, బబితను దిల్లీలోని రైల్వే స్టేషన్లో పట్టుకోగా, కునాల్, సుమిత్ను హరియాణాలోని సోనిపత్ లో అరెస్ట్ చేశారు. మొదట నిందితులను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ముంబయి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) అధికారులు వారిని అరెస్ట్ చేసేందుకు, విచారించేందుకు అనుమతి కోరారు. కోర్టు ఇందుకు అంగీకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande