ఏపీ స్థానిక ఎన్నికలు.. నామినేషన్లకు ఎన్ఓసీ, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన మిగిలిన పత్రాలను నిబంధనల ప్రకారం సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
Election commission


అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన మిగిలిన పత్రాలను నిబంధనల ప్రకారం సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్ఓసీ, నో డ్యూ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం లేదా నామినేషన్ల స్వీకరణలో జాప్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఈ సూచనలను పాటించాలని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టంలో ఎన్ఓసీ తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన లేదని SEC వెల్లడించింది. చట్టంలో పేర్కొనని పత్రాలను తప్పనిసరి అంటూ అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి వీల్లేదనే విషయాన్ని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande