తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి కొండ ప్రాంతం పూర్తిగా మేఘావృతమైంది.
Rain


అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి కొండ ప్రాంతం పూర్తిగా మేఘావృతమైంది. దట్టమైన పొగమంచు, నిరంతర వర్షం కారణంగా తిరుమలలో రాకపోకలు, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి నుంచి వర్షం తీవ్రత పెరగడంతో తిరుమలలోని ప్రధాన రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు సమాచారం. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు వర్షంలో తడుస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది. వర్షం కారణంగా దర్శనం పూర్తిచేసుకున్నవారు కూడా ఆలయం నుంచి వసతి గదులకు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు వర్షం తగ్గేవరకు టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల కింద ఆశ్రయం పొందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande