
కడప , 21 అక్టోబర్ (హి.స.)
కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పలు కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ మరియు ఇతర శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోకి ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలతో పాటు అధికార పార్టీ శ్రేణులు భారీ గుంపుగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలిపివేశారు. ఇదే సమయంలో పోలీసుల రక్షణతో నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిగా వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా తిరగబడటంతో ఆ ప్రాంతమంతా కాసేపు రణరంగంగా మారింది.
పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోరుమామిళ్లలో వైఎస్సార్సీపీ నేత కల్లూరి రమణారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలను, అలాగే ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రంగంలోకి దిగిన అదనపు బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టి, ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్