వేగవంతంగా వరి ధాన్యం కొనుగోళ్లు – రైతులకు నాణ్యతా ప్రమాపాలపై సూచనలు
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Telangana govt


కరీంనగర్ , 22 అక్టోబర్ (హి.స.)కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వేగంగా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గురువారం జిల్లాలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్లను అధికారుల బృందం పరిశీలించింది. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యంలో తేమ శాతాన్ని కచ్చితంగా కొలిచేందుకు ప్రత్యేక యంత్రాలను అందుబాటులో ఉంచారు.

ప్రభువు నిర్దేశించిన తేమ శాతం నిబంధనల ప్రకారం గ్రేడ్-ఎ రకం ధాన్యానికి గరిష్ట మద్దతు ధర దక్కేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ బస్తాలలో నింపి వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల సౌకర్యార్థం తాగునీటి సదుపాయం, టార్పాలిన్లు, నీడ ఏర్పాట్లను పరిశీలించారు. ఏ ఒక్క రైతుకు కూడా కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి గింజా సేకరించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు భరోసా కల్పించారు. ఈ చర్యలతో రైతులలో కొంత ఊరట లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande