
అమరావతి , 23 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న తరుణంలో అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటూ.. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతి తదితర నియోజకవర్గాల్లోని కొన్ని నిర్దేశిత వార్డులకు నామినేషన్ల స్వీకరణ గడువును మరో 48 గంటల పాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో నామినేషన్లు సమర్పించే సమయంలో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికారుల వద్ద జరిగిన వాగ్వాదాలు మరియు ఇతర సాంకేతిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించారు. దీనివల్ల నామినేషన్లు వేయలేకపోయిన ప్రతిపక్ఇతర పార్టీల అభ్యర్థులకు మళ్లీ అవకాశం దక్కింది. పొడిగించిన గడువులోగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సక్రమంగా సమర్పించాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పోలీసుల రక్షణతో నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్