
జనగామ, 24 అక్టోబర్ (హి.స.)
రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు మెరుగైన సేవలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
శనివారం లింగాల ఘనపురం మండలం బండ్లగూడ గ్రామంలోని మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. వ్యాపార లావాదేవీల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు సుమారు 60 టన్నుల యూరియా సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి రూ.19 లక్షల మేర వ్యాపారం నిర్వహించినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు