ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు చేరినప్పుడే నిజమైన మార్పు.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట నియోజకవర్గంలోని మారుమూల పల్లె మొదలుకొని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నదే తన ఏకైక ధ్యేయమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.
Mla


ఖమ్మం, 24 అక్టోబర్ (హి.స.)

అశ్వారావుపేట నియోజకవర్గంలోని మారుమూల పల్లె మొదలుకొని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నదే తన ఏకైక ధ్యేయమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు, జీవితంలో భరోసా నింపేందుకు నిరంతరం పాటుపడతానని చెప్పారు.

ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని భరోసా ఇచ్చారు. నా మార్గం ప్రజా సేవ.. నా లక్ష్యం సమగ్ర అభివృద్ధి.. నా సంకల్పం ప్రజా శ్రేయస్సు అని స్పష్టం చేస్తూ, నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన ప్రేమానురాగాలు, ఆదరణతో అశ్వారావుపేటను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.

ప్రజలకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా తన ప్రతి అడుగు ముందుకు పడుతోందని అన్నారు. ప్రజల అవసరాలే తన ఆలోచనలకు పునాది అని, వారి ఆశయాలే తన ప్రజా జీవితానికి దిక్సూచి అని ఆయన ఉద్ఘాటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande