మిషన్ భగీరథ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్ భాష
జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టులో ఉన్న జిల్లా మిషన్ భగీరథ కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాష శనివారం సందర్శించారు.
Collector


జోగులాంబ గద్వాల, 24 అక్టోబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టులో ఉన్న జిల్లా మిషన్ భగీరథ కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాష శనివారం సందర్శించారు.

ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ కేంద్రంలోని నీటి శుద్ధి ప్రక్రియ, నాణ్యత పరీక్షలు, రసాయనాల వినియోగం, సిబ్బంది హాజరు, రికార్డులను కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్, టర్బిడిటీ, క్లోరిన్ స్థాయిలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ముడి నీటి నాణ్యతను బట్టి జార్ టెస్టులు చేసి, అవసరమైన రసాయనాలను సరైన మోతాదులోనే వాడాలని చెప్పారు.

నీటి నాణ్యత పరీక్షలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో పాటు బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande