కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా
కృష్ణా నదీ జలాల నిర్వహణకు సంబంధించి సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది.
Krishna river


హైదరాబాద్ , 24 అక్టోబర్ (హి.స.)

కృష్ణా నదీ జలాల నిర్వహణకు సంబంధించి సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు సమావేశాన్ని ఒక రోజు పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం ఈ సమావేశం మంగళవారం జరగనుంది.

సోమవారం ముంబయిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కేఆర్ఎంబీ సమావేశాన్ని మరో రోజుకు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కొరింది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు బోర్డు అంగీకరించడంతో సమావేశం వాయిదా పడింది.

కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కీలకమైనవి. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగాల్సి ఉన్నందున ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande