యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి.. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు అండగా నిలబడి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
Mla


ఆదిలాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు అండగా నిలబడి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ పేరుతో ప్రత్యేక బృందం పనిచేస్తోందని తెలిపారు.

యువతను సరైన మార్గంలో నడిపించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువతలో చైతన్యం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande