ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి శ్రీహరి
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ లో రూ.28 కోట్ల వ్యయంతో చేపట్టిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు.
Minister


వనపర్తి, 24 అక్టోబర్ (హి.స.)

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ లో రూ.28 కోట్ల వ్యయంతో చేపట్టిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు.

పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రి పూర్తయితే ఆత్మకూర్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా లాభం చేకూరుతుందన్నారు.

ఎమర్జెన్సీ వైద్యం కోసం ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మంచి వైద్య సేవలు అందుతాయని చెప్పారు. నాణ్యతతో, త్వరగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande