పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు.. వామపక్షాల మద్దతుపై చర్చ
తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి.
CONGRESS


హైదరాబాద్ , 24 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మద్దతు పొందే అంశంపై కాంగ్రెస్ వర్గాలు దృష్టి సారించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదైన విద్యావంతులు, ఉద్యోగార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్న పట్టభద్రులు కీలక పాత్ర పోషిస్తారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగం, నిరుద్యోగం, ప్రభుత్వ విధానాలపై అభిప్రాయాలు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా వామపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజకీయంగా కలిసి పనిచేసిన పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, ఓట్ల బదిలీ వంటి అంశాలు కీలకంగా మారుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande