
అమరావతి , 24 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం, దాడులు చేయడం వంటి అంశాలపై ఇరు పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని రెండు వర్గాలు తమ వాదనలను వినిపిస్తున్నాయి.
నామినేషన్ల దాఖలుకు సంబంధించిన కొన్ని మున్సిపాలిటీల్లో అదనపు సమయం కల్పించే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న నేపథ్యంలో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 19 మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని చోట్ల అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మరో రెండు రోజుల అవకాశం కల్పించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, పర్యవేక్షణ కోసం అమికస్ క్యూరీని నియమించాలని, కేంద్ర భద్రతా బలగాలను వినియోగించాలని, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచాలని కొరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్