
అమరావతి , 25 అక్టోబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమైయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, కీలక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర ప్రభుత్వ సహకారం ముఖ్యమైనది. మౌలిక సదుపాయాలు, రవాణా, పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ రంగ విస్తరణ వంటి అంశాల్లో కేంద్ర శాఖలతో సమన్వయం అవసరం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశంగా రాజకీయ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో కొనసాగుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయడం, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి ప్రయోజనాలు అందించడం వంటి విషయాల్లో కేంద్ర మంత్రులతో జరిగే సమావేశాలు కీలకంగా మారుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్