రాష్ట్రంలో కరువును కోరుకుంటున్న బీఆర్ఎస్.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.
Mp


భువనగిరి, 26 అక్టోబర్ (హి.స.)

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.

ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరవు వస్తే బాగుంటుందని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ డిబేట్ కు దారి తీశాయి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా చామల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావం, కరవు నివారణ చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 28న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande