కాంగ్రెస్ రాజకీయాల ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.. రాజ్ నాథ్ సింగ్
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన రాజ్నాథ్ సింగ్
Rajnath Singh


న్యూఢిల్లీ, 26 అక్టోబర్ (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు దేశంలోని కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మరింత గంభీరంగా, సంయమనంతో, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయ పతనాన్నే కాకుండా, ఆ పార్టీ సైద్ధాంతిక పతనాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా జీవితంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరింత సంయమనం, గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

ఇలాంటి భాష పార్టీ అధ్యక్ష పదవికి ఉన్న గౌరవానికి విరుద్ధమని, కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజకీయాల ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తారని, సరైన సమయంలో తగిన సమాధానం ఇస్తారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande