హోప్ ఐలాండ్ వాసుల సురక్షిత ప్రాంతానికి తరలింపు
అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
Ap police


కాకినాడ , 26 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాళ్లరేవు మండల పరిధిలోని హోప్ ఐలాండ్లో నివసిస్తున్న సుమారు 130 మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో హోప్ ఐలాండ్ వాసుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి, అక్కడ నివసిస్తున్న వారిని సముద్ర మార్గంలో సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించారు. తరలించిన వారిని కాకినాడలోని తూరంగి ప్రాంతంలో ఉన్న ఐలాండ్ కాలనీకి చేర్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande