వాల్మీకి మహర్షి చరిత్రను స్పూర్తి గా తీసుకోవాలి.. హనుమకొండ జిల్లా కలెక్టర్
రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు
Collector collector


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

వాల్మీకి మహర్షి చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సూచించారు. రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అన్నారు. వాల్మీకి మహర్షి కేవలం కవి మాత్రమే కాదని, మన సంస్కృతి, ధర్మ మూలాలకు వెలుగునిచ్చిన మార్గదర్శి అని తెలిపారు. ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవడం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే మహర్షికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande