ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే మనందరి బాధ్యత: హైడ్రా కమిషనర్
ఆరోగ్యకరమైన ఆహారంతోనే భావితరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టగలమని హైడ్రా కమిషనర్, ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు.
రంగనాథ్


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

ఆరోగ్యకరమైన ఆహారంతోనే భావితరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టగలమని హైడ్రా కమిషనర్, ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు.

కల్తీ ఆహారం, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహారాన్ని సరఫరా చేయడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే విధానాలలో తక్షణమే మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తర్వాతి తరానికి మనం ఇచ్చే ఆస్తులు, సంపద కంటే స్వచ్ఛమైన నీరు, నాణ్యమైన ఆహారమే అత్యంత ముఖ్యమైనవని రంగనాథ్ పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పోషకాహారాన్ని అందిస్తూ, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్న డాక్టర్ లక్ష్మణ్ ‘లక్ష్మణ్ ఆరోగ్యగ్రామం’ వంటి సంస్థల సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు.

నేటి తరం యువత తాము తీసుకునే ఆహార నియమాలు, పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛమైన నీటి వినియోగంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande