
జగిత్యాల , 26 అక్టోబర్ (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల మంజూరితో పేదల సొంతింటి కల నెరవేరుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. పంచాయతీ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. త్వరలో ఎల్నినో పరిస్థితులు సూపర్ ఎల్నినోగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆలోచన చేయాలని కోరారు
ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..