
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.) సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 31 వరకు పోక్సో చట్టం పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో న్యాయమూర్తి మాట్లాడుతూ.. 18 సం.ల లోపు బాల బాలికలకు పోక్సో చట్టం వర్తిస్తుందని, చట్టంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా బాల బాలికలకు రక్షణ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..