మన్యం జిల్లాలో 15 మండలాలకు తుపాను కంట్రోల్ రూమ్ నంబర్లు
మన్యం జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రజలకు అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశారు.
Ap govt


మన్యం జిల్లా , 26 అక్టోబర్ (హి.స.)

మన్యం జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రజలకు అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే ప్రజలు ఈ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.

మండలాల వారీగా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు ఇలా ఉన్నాయి. పార్వతీపురం – 83747 68252, కొమరాడ – 62816 57058, సీతానగరం – 94417 80526, బలిజిపేట – 99484 96768, సాలూరు – 73862 38564, పాచిపెంట – 95508 57799, మక్కువ – 85005 25011, గరుగుబిల్లి – 93465 56187, జియ్యమ్మవలస – 76758 02129, కురుపాం – 94415 71485, జి.ఎల్.పురం – 94901 15460, పాలకొండ – 97014 71460, సీతంపేట – 94942 01944, వీరఘట్టం – 79815 75988, భామిని – 9703076258.

తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సమీపంలోని కంట్రోల్ రూమ్ను సంప్రదించి సహాయం పొందవచ్చు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రజల భద్రతకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande