ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ పీవీ సింధుకు లోకేశ్ అభినందనలు
ఫ్రెంచ్ ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
pv sindhu


అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)

ఫ్రెంచ్ ఓపెన్-2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సె యంగ్తో సింధు గట్టిపోటీ ఇచ్చిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విజయం కోసం ఆమె ప్రదర్శించిన పట్టుదల, పోరాట స్ఫూర్తి భారత క్రీడాభిమానులకు స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఫైనల్లో టైటిల్ చేజారినప్పటికీ, సింధు ప్రదర్శన భారత బ్యాడ్మింటన్ స్థాయిని మరోసారి చాటిందని లోకేశ్ కొనియాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు నిలకడగా రాణించడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న టోర్నీల్లోనూ సింధు ఇదే ఉత్సాహంతో ఆడి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆమె భవిష్యత్ క్రీడా ప్రయాణం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఇదే సందర్భంగా జర్మనీలో నిర్వహించిన 43వ మ్యూన్స్టర్లాండ్ ఓపెన్-2026 చెస్ టోర్నమెంట్లో టైటిల్ సాధించిన భారత చెస్ క్రీడాకారుడు లలిత్ బాబును కూడా లోకేశ్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడం భారత చెస్కు గర్వకారణమని పేర్కొన్నారు. లలిత్ బాబు తన ప్రతిభతో మరిన్ని విజయాలు అందుకోవాలని, ప్రపంచ చెస్ రంగంలో భారత్ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande