గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి వివేక్ సమీక్ష
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూర్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Minister


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూర్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పుష్కర ఘాట్ల వద్ద మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులకు నిధులు కేటాయించినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంత్రి వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చెన్నూర్ పట్టణంలో చేపట్టనున్న రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.5.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా, జాతియ రహదారి పరిధిలోని రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఘాట్ల అభివృద్ధి పనుల కోసం రూ.3.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఘాట్ల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande