
కామారెడ్డి, 26 అక్టోబర్ (హి.స.)
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి అనసూయ సీతక్క హాజరుకానున్నారు.
మంత్రి పర్యటన వివరాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పర్యటన ఏర్పాట్లపై సోమవారం తన నివాసంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
కార్యక్రమాలను ఎలా నిర్వహించాలనే దానిపై దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..