
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వేసవిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.
సోమవారం రఘునాథపాలెం మండలంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. మల్లేపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, నీటితో నిండిన నల్లకుంట చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తూ సహజ వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..