
న్యూ ఢిల్లీ , 26 అక్టోబర్ (హి.స.)
భారత పార్లమెంటు లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి నేడు తృటిలో ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని పూార్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పై ఈ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
కాన్వాయ్ లతో పాటుగా ఓ అంబులెన్స్ ను కూడా అవి డీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రమాదం జరగ పోవడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
భద్రతా వాహనాలు అకస్మాత్తుగా అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే భద్రతా బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..