మత్స్యకారులకు తీవ్ర హెచ్చరికలు – నియంత్రణ గదుల ఏర్పాటు
సముద్రం అత్యంత అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని కఠిన ఆంక్షలు విధించారు.
Ap govt


అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)

సముద్రం అత్యంత అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని కఠిన ఆంక్షలు విధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన పడవలు తక్షణమే సమీపంలోని సురక్షిత రేవులకు చేరుకోవాలని ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంతో పాటు అన్ని తీరప్రాంత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణా, విద్యుత్ సరఫరా మరియు తాగునీటి వ్యవస్థలకు అంతరాయం కలగకుండా పునరుద్ధరణ చర్యలను సిద్ధం చేశారు.

రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టిందని భరోసా ఇచ్చారు. కంట్రోల్ రూమ్ నంబర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande