
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు కివీస్ బ్యాటర్లు చివరి ఓవర్లలో చుక్కలు చూపించారు. డారిల్ మిచెల్ అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయానికి 199 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో భారత బౌలర్లు కివీస్ ఓపెనర్లపై ఒత్తిడి పెంచినప్పటికీ, మిడిల్ ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ వేగం పుంజుకుంది. ముఖ్యంగా డారిల్ మిచెల్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 52 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంటుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో భారత బౌలర్లు కివీస్ ఓపెనర్లపై ఒత్తిడి పెంచినప్పటికీ, మిడిల్ ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ వేగం పుంజుకుంది. ముఖ్యంగా డారిల్ మిచెల్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 52 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..