అభిషేక్ శర్మ దూకుడు !మూడో టీ20లో భారత్ ఘన విజయం (update)
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.
క్రికెట్


వెల్డింగ్టన్, 27 అక్టోబర్ (హి.స.)

న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. కివీస్ నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు అలవోకగా ఛేదించారు. కేవలం 13.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్

భారత జట్టు విజయానికి యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు సాధించి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడు ప్రదర్శించిన అభిషేక్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి పరుగుల వరద పారించాడు. అతడి ధాటికి భారత జట్టు లక్ష్యం దిశగా వేగంగా దూసుకెళ్లింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande