మాదక ద్రవ్యాల అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. మెదక్ జిల్లా ఎస్పీ
నేడు (మంగళవారం) నిజాంపేట పోలీస్ స్టేషన్ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sp


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

నేడు (మంగళవారం) నిజాంపేట పోలీస్ స్టేషన్ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించడంతో పాటు వివిధ కేసుల దర్యాప్తు ఏ మేరకు పురోగతిలో ఉందో సమీక్షించారు. కేసులకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.

యువతలో నేరాల పట్ల అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande