
నిజామాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
మంగళవారం మోర్తాడ్లోని ప్రజానిలయానికి చేరుకున్న ఆమెకు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్తో పాటు పార్టీ నాయకులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముత్యాల సునీల్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీతక్క సంబంధిత అధికారులతో మాట్లాడి, నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..