
రాజన్న సిరిసిల్ల, 27 అక్టోబర్ (హి.స.)
అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఎస్పీ మహేష్ గీతే అన్నారు.
పోలీసు అమవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం పోలీస్ అమరవీరుల ఆత్మశాంతి, వారి కుటుంబాల సంక్షేమం కోసం పట్టణ పరిధిలోని హెబ్రోసు చర్చిలో ఎస్పీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని చర్చి పాస్టర్లు, ఫాదర్లతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..